కొత్త జంటకు సరికొత్త బహుమతి

పెళ్లిళ్ల వేళ కల్యాణ మండపాలు వెలిగిపోతున్నాయి. అదే సమయంలో వధూవరుల మోమున కాంతిని మరింత పెంచాలంటే వారికి తగిన బహుమతి ఇవ్వాలి. ఏమివ్వాలి అని ఆలోచించే బదులు.

Updated : 05 Mar 2023 02:29 IST

ఆన్‌లైన్‌ గిఫ్ట్‌కార్డుల జోరు
మారుతున్న ధోరణి

దిల్లీ: పెళ్లిళ్ల వేళ కల్యాణ మండపాలు వెలిగిపోతున్నాయి. అదే సమయంలో వధూవరుల మోమున కాంతిని మరింత పెంచాలంటే వారికి తగిన బహుమతి ఇవ్వాలి. ఏమివ్వాలి అని ఆలోచించే బదులు.. ఆన్‌లైన్‌ గిఫ్ట్‌కార్డులిస్తే వారికి ఇష్టమైన పద్ధతిలో వినియోగంచుకుంటారు కదా అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త జంటలు పెళ్లి అనంతరం చేసే విహార యాత్రలకు ఉపకరించే ‘షాగున్‌’ కార్డుల విక్రయాలు ఈ పెళ్లిళ్ల సీజను(డిసెంబరు 2022-జనవరి 2023)లో ఏకంగా 30 శాతం పెరగడం చూస్తుంటే.. ధోరణి మారిందనే అనిపిస్తోంది. తమ స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల పెళ్లి బహుమతిగా ఇవ్వడానికి వీటిపైనే ఎక్కువ మంది దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రూ.10,000 కార్డు ఎక్కువగా విక్రయమైంది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.5,000; రూ.1,000 కార్డులున్నాయి. వీటితో దంపతులు హాలిడే ప్యాకేజీలు, హోటళ్లు, విమాన, రైలు, బస్సు టికెట్ల వంటివి కొనుగోలు చేయడానికి వీలుంటుంది.ఆన్‌లైన్‌ గిఫ్ట్‌ కార్డుల విక్రయానికి, పెళ్లిళ్ల సీజనుకు మంచి అనుబంధం కనిపిస్తోందని మేక్‌మైట్రిప్‌ అంటోంది. గతంలో నగదు లేదా బంగారం వంటివాటిపైనే ఎక్కువ మొగ్గుచూపే ప్రజలు ఇపుడు గిఫ్ట్‌ కార్డుల వైపుచూస్తున్నారని అన్నారు.

తమ సర్వేలో ఏం తేలిందని ఆయన అంటున్నారంటే..

45-55 ఏళ్ల వయసుండే ఎగ్జిక్యూటివ్‌లు తమ స్నేహితులు లేదా బంధువులకు గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారు.

30-45 వయసున్న యువత మాత్రం ట్రెండీగా ఉండాలని భావిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ గిఫ్ట్‌ కార్డుల వైపు ఈ రెండు వర్గాల వారు చూస్తున్నారు.

47 శాతం మంది గిఫ్ట్‌కార్డు కొనుగోలుదార్లు తమ బహుమతికి అదనంగా రూ.1ని జత చేస్తున్నారు.

ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణెల్లో ఈ కార్డుల విక్రయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పట్నా, జయపుర వంటి నగరాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు