JIO: జియో చేతికి అమెరికా కంపెనీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సామగ్రి తయారీ సంస్థ మిమోసా నెట్‌వర్క్స్‌ను 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.490 కోట్లు)తో కొనుగోలు చేయనుంది.
5జీ సేవల బలోపేతానికి వినియోగం
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సామగ్రి తయారీ సంస్థ మిమోసా నెట్‌వర్క్స్‌ను 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.490 కోట్లు)తో కొనుగోలు చేయనుంది. 5జీ టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఎయిర్‌స్పాన్ నెట్‌వర్క్స్ హోల్డింగ్స్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ రాడిసిస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. వైఫై-5తో పాటు సరికొత్త వైఫై 6ఈ సాంకేతికత ఆధారంగా పాయింట్-టు-మల్టీ పాయింట్ ఉత్పత్తులతో పాటు సంబంధిత విడిభాగాలనూ మిమోసా తయారు చేస్తోంది. ఇంత వరకు ఈ కంపెనీకి ప్రధాన వినియోగదారుగా ఉన్న జియో.. ఇపుడు యజమానిగా మారనుంది. చైనా సాంకేతికత నుంచి దూరం జరగాలని ప్రపంచ దేశాలు భావిస్తున్న ఈ తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం విశేషం. 2018లో మిమోసాను ఎయిర్‌స్పాన్ కొనుగోలు చేసింది.
మరిన్ని నగరాలకు 5జీ సేవలు: ఇప్పటికే తెలంగాణాలో 10 నగరాల్లో 5జీ సేవలందిస్తున్న జియో, కొత్తగా సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్ ప్రాంతాలకూ విస్తరించినట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్!
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు
-
Politics News
Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత వేటు.. పార్లమెంట్లో నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!