జియో ప్లస్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలు

జియో ప్లస్‌ పేరిట పోస్ట్‌పెయిడ్‌ (నెలవారీ అద్దెపై లభించే) కుటుంబ పథకాలను రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది.

Published : 15 Mar 2023 01:13 IST

హైదరాబాద్‌: జియో ప్లస్‌ పేరిట పోస్ట్‌పెయిడ్‌ (నెలవారీ అద్దెపై లభించే) కుటుంబ పథకాలను రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నలుగురు సభ్యులు కలిగిన కుటుంబానికి ఒక నెల పాటు ఉచిత సేవలు అందించనుంది. కుటుంబ పథకాల నెల అద్దె రూ.399 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒక్కో సిమ్‌కు రూ.99 చెల్లించి మరో 3 కనెక్షన్‌లు తీసుకోవచ్చు. దీంతో నెలవారీ ఛార్జీ రూ.696 అవుతుంది. అంటే ఒక్కో సిమ్‌కు సగటున రూ.174 ఛార్జీ పడుతుంది. ఇందులో అపరిమిత కాల్స్‌, 75 జీబీ డేటా, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. రూ.699 పథకంతో 100జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సేవలు అందిస్తున్నారు. ఇక వ్యక్తిగత పథకాలు చూస్తే.. రూ.299తో 30జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, రూ.599తో అపరిమిత డేటా, కాల్స్‌ పొందొచ్చు. ఈ నెల 22 నుంచి అన్ని జియో స్టోర్‌ల్లో జియో ప్లస్‌ సేవలు లభిస్తాయి. 7000070000కు మిస్డ్‌కాల్‌ కూడా ఇవ్వొచ్చు. ప్రస్తుత జియో ప్రీపెయిడ్‌ వినియోగదారులు కూడా సిమ్‌ మార్చుకోకుండానే పోస్ట్‌పెయిడ్‌ ఉచిత ట్రయల్‌ పథకానికి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఫ్యాన్సీ నంబర్లు కూడా ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని