అమెరికాలో బ్యాంకింగ్‌కు రూ.2.5 లక్షల కోట్ల ప్యాకేజీ
అమెరికాలోని 16వ అతిపెద్దదైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌తో పాటు సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలిన నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు.. మరో బ్యాంక్ పతనం కాకుండా చూసేందుకు అమెరికాలోని 11 పెద్ద బ్యాంకులు నడుం బిగించాయి.
సిద్ధం చేసిన 11 పెద్ద బ్యాంకులు
మరొకటి కుప్పకూలకుండా చూసేందుకే
న్యూయార్క్: అమెరికాలోని 16వ అతిపెద్దదైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌తో పాటు సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలిన నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు.. మరో బ్యాంక్ పతనం కాకుండా చూసేందుకు అమెరికాలోని 11 పెద్ద బ్యాంకులు నడుం బిగించాయి. ఎస్‌వీబీ తరహాలోనే సమస్యలను ఎదుర్కొంటున్న మరో బ్యాంకు ‘ఫస్ట్ రిపబ్లిక్’ కోసం 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్ల) సహాయ ప్యాకేజీని ఇవి సిద్ధం చేశాయి.
ఎందుకంటే..: గురువారం కొద్ది గంటల్లోనే ఫస్ట్ రిపబ్లిక్ డిపాజిటర్లు ఏకంగా 40 బి.డాలర్ల (సుమారు రూ.3.28 లక్షల కోట్ల) మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. గత డిసెంబరు ఆఖరుకు 176.4 బి.డాలర్ల డిపాజిట్లున్న ఈ బ్యాంకు, తాజా పరిణామంతో ఎస్‌వీబీ తరహా సమస్యల్నే ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) సాధారణంగా 2.5 లక్షల డాలర్లలోపు డిపాజిట్లకు బీమా కల్పిస్తుంది. అంతకు మించిన, బీమా లేని డిపాజిట్లే ఈ బ్యాంకు నుంచి ఉపసంహరణకు గురైనట్లు తెలుస్తోంది. జేపీ మోర్గాన్, ఫెడరల్ రిజర్వ్‌ల నుంచి అదనపు నిధులను పొందుతున్నట్లు ఫస్ట్ రిపబ్లిక్ చెప్పినా సోమవారం ఈ బ్యాంకు షేరు 60% కుప్పకూలింది.. గురువారమూ తొలుత షేరు 36% నష్టపోయినా.. ప్యాకేజీ నేపథ్యంలో 10% లాభపడింది.
ఈ బ్యాంకుల మద్దతు: జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్‌ఫార్గోలు తలా 5 బి. డాలర్లను బీమాలేని డిపాజిట్ల కోసం కేటాయించాయి. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మాన్‌శాక్స్ బ్యాంకులు 2.5 బి. డాలర్ల చొప్పున డిపాజిట్ చేయనున్నాయి. మరో 5 బి. డాలర్లను బీఎన్‌వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్‌సీ బ్యాంక్, ట్రూయిస్ట్, యూఎస్ బ్యాంకు ఇవ్వనున్నాయి.
దివాలా రక్షణ కోరిన ఎస్‌వీబీ మాతృసంస్థ
సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌వీబీ) మాతృసంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ‘చాప్టర్ 11 దివాలా రక్షణ’ కోసం పిటిషన్ దాఖలు చేయనుంది. స్‌వీబీని ఎఫ్‌డీఐసీ తన ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్‌నకు ఎస్‌వీబీతో సంబంధాలుండవు. అందుకే దానిని చాప్టర్ 11 కిందకు జత చేయలేదు.
అమెరికా బ్యాంకుల్లో టీసీఎస్, ఇన్ఫీల పెట్టుబడులు
అమెరికాలోని ప్రాంతీయ బ్యాంకుల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్‌లకు భారీ డిపాజిట్లున్నాయని జేపీ మోర్గాన్ వెల్లడించింది. ఆయా కంపెనీలు తమ ఆదాయాల్లో 2-3% మేర అమెరికా ప్రాంతీయ బ్యాంకుల్లో పెట్టినట్లు జేపీ మోర్గాన్ తెలిపింది. ఇందువల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీలపై 10-20 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ఈ మూడు కంపెనీలు ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి, ‘ఎస్‌వీబీలో పెట్టుబడులకు విడిగా కేటాయింపులు జరపాల్సి రావొచ్చని’ జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. ఐరోపా, అమెరికా వంటి కీలక మార్కెట్లలో స్థూల ఆర్థిక అనిశ్చితుల కారణంగా భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజా బ్యాంకింగ్ సంక్షోభం వల్ల ఒప్పందాల్లో ఆలస్యంతో పాటు ఆదాయాలు, ఆర్డర్లపై వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రభావం పడొచ్చని జేపీ మోర్గాన్ అంటోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీ