హైదరాబాద్‌లో నామ్‌ధారీ రిటైల్‌ విక్రయ కేంద్రం

నామ్‌ధారీ గ్రూపునకు చెందిన సింప్లీ నామ్‌ధారీ రిటైల్‌ స్టోరు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రైతులతో కలిసి పనిచేస్తూ, వినియోగదారుల కోసం నిత్యావసరాలతో పాటు, వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు నామ్‌ధారీ గ్రూపు సీఈఓ గురుముఖ్‌ రూప్ర అన్నారు.

Published : 18 Mar 2023 01:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: నామ్‌ధారీ గ్రూపునకు చెందిన సింప్లీ నామ్‌ధారీ రిటైల్‌ స్టోరు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రైతులతో కలిసి పనిచేస్తూ, వినియోగదారుల కోసం నిత్యావసరాలతో పాటు, వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు నామ్‌ధారీ గ్రూపు సీఈఓ గురుముఖ్‌ రూప్ర అన్నారు. 11వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో 30వేలకు పైగా ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. నామ్‌ధారీ విత్తనాలను ఉపయోగిస్తున్న రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో 30 రిటైల్‌ కేంద్రాలు ఉన్నాయని, త్వరలోనే హైదరాబాద్‌లో మరో 4 స్టోర్లను ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విత్తనాల విక్రయాల్లో మూడో స్థానంలో ఉన్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకుంటామని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు