చెల్లింపు వ్యవస్థలను అంతర్జాతీయం చేయాలి: దాస్‌

యూపీఐ, రూపే వంటి చెల్లింపు వ్యవస్థలను భారత్‌ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, జీ20 అధ్యక్షతను ఇందుకు వినియోగించుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

Updated : 19 Mar 2023 02:44 IST

కోచి: యూపీఐ, రూపే వంటి చెల్లింపు వ్యవస్థలను భారత్‌ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, జీ20 అధ్యక్షతను ఇందుకు వినియోగించుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి యూపీఐ, రూపే నెట్‌వర్క్‌లు విస్తరిస్తే, సీమాంతర చెల్లింపులు సులభతరం అవుతాయని అభిప్రాయపడ్డారు. పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ (పీఎస్‌ఓ) సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్‌ మాట్లాడారు. ‘ఆర్‌బీఐ పేమెంట్స్‌ విజన్‌ 2025’ కింద, ప్రతి ఒక్కరికి, ప్రతి చోట, ప్రతిసారి ఇ-చెల్లింపులు అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. అంతర్జాతీయ వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ చేరువకావడం పెరుగుతోందని, సీమాంతర చెల్లింపులకు ప్రాధాన్యత లభిస్తోందని వెల్లడించారు.

రూ.51 లక్షల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు: పీఎస్‌ఓలు, ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి అంతర్జాతీయ చెల్లింపుల రంగంలో భారత్‌ను కలికితురాయిలా నిలిపాయని దాస్‌ పేర్కొన్నారు. ఒక్క జనవరి 2023లోనే రూ.51 లక్షల కోట్ల విలువైన 1050 కోట్ల రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు నమోదయ్యాయని.. ఇది భారత డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం, సామర్థ్యానికి ప్రతిబింబమని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు