దూకుడుగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ

ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమని ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక వెల్లడించింది. ఇది లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా మారడం, గణనీయంగా ఉపాధి అవకాశాల్ని సృష్టించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి దేశ లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడుతుందని పేర్కొంది.

Updated : 19 Mar 2023 01:37 IST

ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక

దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమని ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక వెల్లడించింది. ఇది లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా మారడం, గణనీయంగా ఉపాధి అవకాశాల్ని సృష్టించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి దేశ లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడుతుందని పేర్కొంది. ‘ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇన్‌ ఇండియా: ది ట్యాక్సేషన్‌ క్వాండరీ’ పేరుతో ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక రూపొందించింది. భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ, పన్నుల సమస్యలపై దీన్ని తయారు చేసింది. ఈ పరిశ్రమపై నియంత్రణ ఆర్థిక అవకాశాలను తెరవడమే కాకుండా వివిధ సామాజిక సమస్యలను కూడా పరిష్కరిస్తుందని అభిప్రాయపడింది. ఆదాయపు పన్ను ఫైలింగ్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ల నుంచి వచ్చే లాభాల గణనలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం ఈ రంగానికి సానుకూలాంశమని నివేదిక వెల్లడించింది. ఆన్‌లైన్‌ గేమ్‌లపై మూలం వద్ద పన్ను మినహాయింపు(టీడీఎస్‌) కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన అమలు యంత్రాంగానికి సంబంధించిన సమస్యను నివేదికలో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని