ఖాతాదారులను దేవుడిలా చూడండి

బ్యాంకింగ్‌ సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఖాతాదారులను దేవుడిలా చూడాలని బ్యాంకులను ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ కోరారు.

Published : 19 Mar 2023 01:27 IST

బ్యాంకులను కోరిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి కరాడ్‌

దిల్లీ: బ్యాంకింగ్‌ సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఖాతాదారులను దేవుడిలా చూడాలని బ్యాంకులను ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ కోరారు. లోపాలను తగ్గించుకోవడంతో పాటు వినియోగదారు సేవలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నిర్వహించిన కస్టమర్‌ మీట్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో ఖాతాదారులు వేగంగా స్పందించాలని, సకాలంలో రుణాలు చెల్లించాలని అన్నారు. రుణాలు చెల్లిస్తేనే బ్యాంకులు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కేసీసీ) పథకాన్ని మరింత మంది రైతులకు చేరే విధంగా చూడాలని బ్యాంకులను కోరారు. చిన్న, సన్నకారు రైతులు, యువత, మహిళలకు బ్యాంకింగ్‌ పరిశ్రమ సేవలు అందించాల్సిన అవసరం ఉందని, వారి వృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కరాడ్‌ ఆకాంక్షించారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మంత్రి నేతృత్వంలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు దూసుకెళ్తోందని వెల్లడించారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటలీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ ఏఎస్‌ రాజీవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని