రూ.34,900 కోట్ల ముంద్రా పెట్రో ప్రాజెక్టు నిలిపివేత!
అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో తలెత్తిన పరిణామాల ప్రభావం అదానీ గ్రూప్‌పై గట్టిగా పడుతోంది. రుణాలెక్కువయ్యాయన్న మదుపర్ల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, కొన్ని రంగాల్లో కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టబోమనీ వెల్లడించింది.
అదానీ గ్రూప్ కీలక నిర్ణయం
దిల్లీ: అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలతో తలెత్తిన పరిణామాల ప్రభావం అదానీ గ్రూప్‌పై గట్టిగా పడుతోంది. రుణాలెక్కువయ్యాయన్న మదుపర్ల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, కొన్ని రంగాల్లో కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టబోమనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని ముంద్రాలో తలపెట్టిన రూ.34,900 కోట్ల పెట్రోకెమ్ ప్రాజెక్టు పనులను నిలిపి వేస్తున్నట్లు తెలుస్తోంది. ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను నెలకొల్పనున్నట్లు 2021లోనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్‌కు చెందిన స్థలంలో బొగ్గు నుంచి పీవీసీ వరకు 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ సుమారు 140 బిలియన్ డాలర్ల వరకు ఆవిరైపోయింది. దీంతో మదుపర్లలో తిరిగి విశ్వాసాన్ని పొందేందుకు, షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేస్తోంది. ముంద్రా ప్రాజెక్టు పనులను పక్కన పెట్టింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వనరులను సమకూరుస్తున్న విక్రేతలు, సరఫరాదార్లు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని అదానీ గ్రూప్ వారికి సమాచారమిచ్చింది. భవిష్యత్తులో నగదు లభ్యత, ఆర్థిక వనరుల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..
-
Ap-top-news News
AP IIIT Admissions 2023: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు వేళాయె
-
Ap-top-news News
Odisha Train Accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే.. సినీఫక్కీలో ₹50 లక్షల చోరీ!
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు