ఐపీఓ అనుమతులపై సెబీ కఠిన వైఖరి

పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో, కొత్తతరం కంపెనల పబ్లిక ఇష్యూ (ఐపీఓ)లకు అనుమతులివ్వడంలో సెబీ కఠిన వైఖరి అవలంబిస్తోంది.

Updated : 20 Mar 2023 02:43 IST

6 కంపెనీల ముసాయిదా పత్రాల తిరస్కరణ

దిల్లీ: పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో, కొత్తతరం కంపెనల పబ్లిక ఇష్యూ (ఐపీఓ)లకు అనుమతులివ్వడంలో సెబీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. గత 2 నెలల్లో 6 కంపెనీల ఐపీఓ అభ్యర్థనలను తిరస్కరించింది. ఇందులో ఓరావెల్‌ స్టేస్‌ కూడా ఉంది. ఓయో బ్రాండ్‌పై హోటళ్లను నిర్వహిస్తున్న సంస్థ ఇది. ఈ కంపెనీలు మరిన్ని పత్రాలతో, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది. ఓయోతో పాటు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్‌ గ్రూప్‌), లావా ఇంటర్నేషనల్‌, బీ2బీ చెల్లింపులు-సేవల సంస్థ పేమేట్‌ ఇండియా, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇండియా, ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ కంపెనీ బీవీజీ ఇండియా ఐపీఓ దరఖాస్తులనూ సెబీ తిరస్కరించింది. ఈ 6 కంపెనీలు 2021 సెప్టెంబరు నుంచి 2022 మే మధ్య తమ ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. వీటిని ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 10  మధ్య సెబీ తిరస్కరించింది. ఈ కంపెనీలన్నీ కలిసి సమీకరించాలనుకున్న మొత్తం రూ.12,500 కోట్లు.

* 2021లో 63 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.2 లక్షల కోట్లు సమీకరించగా, 2022లో 38 సంస్థలు రూ.59,000 కోట్లే సమీకరించాయి. ఎల్‌ఐసీ రూ.20,557 కోట్ల ఇష్యూ లేకపోతే, గతేడాది ఈ మొత్తం మరింత తక్కువ ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని