జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విలీనం
కంపెనీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పెట్టుబడుల సమీకరణను పెంచుకునేందుకు వీలుగా మార్కెట్లో నమోదు కాని అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను విలీనం చేసుకుంటున్నట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది.
ఫ్రాన్స్ సంస్థ నుంచి రూ.2,900 కోట్ల సమీకరణ
ముంబయి: కంపెనీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పెట్టుబడుల సమీకరణను పెంచుకునేందుకు వీలుగా మార్కెట్లో నమోదు కాని అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను విలీనం చేసుకుంటున్నట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. అన్ని అనుమతులూ వస్తే ఈ విలీన లావాదేవీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందువల్ల సంస్థ బ్యాలెన్స్ షీట్ మెరుగవడంతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన గ్రూపె ఏడీపీ నుంచి నిధులు పొందేందుకు వీలవుతుందని పేర్కొంది. విలీనం తర్వాత స్టాక్ మార్కెట్లో సంస్థ ఇప్పటిలాగానే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొనసాగుతుంది. ఇందులో మాతృ సంస్థ జీఎంఆర్ గ్రూపు వాటా 33.7%, గ్రూపె ఏడీపీకి 32.3%, మిగతాది ప్రజల చేతిలో ఉంటుంది. ఈ విలీనం తర్వాత గ్రూపె ఏడీపీ నుంచి రూ.550 కోట్ల నగదును అందుకోనున్నట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రా తెలిపింది. గ్రూపె ఏడీపీ నుంచి పదేళ్ల 6.76% విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల ద్వారా రూ.2,900 కోట్లను సమీకరించబోతున్నట్లు వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు