కృత్రిమ మేధలో 45,000 ఉద్యోగాలు

భారత్‌లో గత నెలలో 45,000 కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదలయ్యాయని మానవ వనరుల కంపెనీ టీమ్‌లీజ్‌ డిజిటల్‌ వెల్లడించింది. ప్రధానంగా డేటా సైంటిస్ట్‌లు, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉన్నట్లు పేర్కొంది.

Published : 21 Mar 2023 01:46 IST

నైపుణ్యాలకు అధిక గిరాకీ: టీమ్‌లీజ్‌ నివేదిక

దిల్లీ: భారత్‌లో గత నెలలో 45,000 కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదలయ్యాయని మానవ వనరుల కంపెనీ టీమ్‌లీజ్‌ డిజిటల్‌ వెల్లడించింది. ప్రధానంగా డేటా సైంటిస్ట్‌లు, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉన్నట్లు పేర్కొంది. ‘ఇనీషియేటివ్‌ ఫర్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (ఐసెట్‌)- ఫోర్సెస్‌ షేపింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో టీమ్‌లీజ్‌ రూపొందించిన నివేదిక  ప్రకారం..

* సంప్రదాయ మెషీన్‌ లెర్నింగ్‌ మోడళ్లను రూపొందించడం అనేది కృత్రిమ మేధలో కెరీర్‌కు అవసరమైన కీలక నైపుణ్యం. ఏఐ ప్రత్యేకతలున్న కొత్త ఇంజినీర్లకు వార్షిక వేతనాలు రూ.10-14 లక్షల మధ్య ఉంటున్నాయి.37% సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 30% సంస్థలు తమ ఉద్యోగుల్లో దాగున్న ప్రతిభను వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నాయి.  

* 55 శాతం ఉద్యోగులు ఏఐ ద్వారా తమకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో 54 శాతం మంది సంస్థలు తప్పకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి, భవిష్యత్‌ ఉద్యోగులను తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని