చౌక 4జీ ల్యాప్‌టాప్‌ల తయారీ

భారత్‌లో చౌక 4జీ ల్యాప్‌టాప్‌లను తయారు చేసే నిమిత్తం ప్రైమ్‌బుక్‌తో దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ జట్టుకట్టింది.

Published : 21 Mar 2023 01:51 IST

ప్రైమ్‌బుక్‌తో ఆప్టిమస్‌ జట్టు

దిల్లీ: భారత్‌లో చౌక 4జీ ల్యాప్‌టాప్‌లను తయారు చేసే నిమిత్తం ప్రైమ్‌బుక్‌తో దేశీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ జట్టుకట్టింది. విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ల్యాప్‌టాప్‌ ప్రైమ్‌బుక్‌ 4జీని తీసుకు రావడం ద్వారా ల్యాప్‌టాప్‌ల తయారీలోకి అడుగుపెట్టినట్టు ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది. ‘వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా (2024 మార్చి) లక్ష ల్యాప్‌టాప్‌లను ఆప్టిమస్‌ తయారు చేయనుంది. భారత్‌లో మొబైల్‌, వేరబుల్‌/ ఇయర్‌బుల్‌, టెలికాం సామగ్రి తయారీలోఉన్న దీర్ఘకాల అనుభవాన్ని ఉపయోగించి.. ఇతర ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అడుగుపెట్టడం ద్వారా తన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు’ ఆప్టిమస్‌ టనలో తెలిపింది. ప్రైమ్‌బుక్‌ ల్యాప్‌టాప్‌ల ధర రూ.16,990. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,990కే లభ్యమవుతాయి. 24 నెలల పాటు నోకాస్ట్‌ ఈఎంఐ లాంటి కొనుగోలు ప్రయోజనాలూ లభిస్తాయి. మైక్రోసాప్ట్‌ 365 పర్సనల్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్‌, ఐప్రిప్‌ ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ ఏడాది పాటు సబ్‌స్క్రిప్సన్‌ను ఉచితంగా పొందొచ్చు. 11.6 అంగుళాల హై- డెఫినేషన్‌ తెర, 4జీబీ అంతర్గత సిస్టమ్‌ మెమరీ, 64 జీబీ రామ్‌, 2 మెగాపిక్సెళ్ల కెమేరా, ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లాంటి ప్రత్యేకతలు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని