పరిస్థితులు సర్దుకుంటున్నాయ్‌

కొన్ని ప్రాంతీయ బ్యాంకుల వైఫ్యలం అనంతరం, మార్కెట్లో పరిస్థితులను కుదుట పరచడానికి అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ ప్రయత్నిస్తున్నారు.

Published : 22 Mar 2023 01:41 IST

బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగానే
అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌

వాషింగ్టన్‌: కొన్ని ప్రాంతీయ బ్యాంకుల వైఫ్యలం అనంతరం, మార్కెట్లో పరిస్థితులను కుదుట పరచడానికి అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ ప్రయత్నిస్తున్నారు. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగానే ఉందని.. ఏవైనా చిన్న సంస్థలు విఫలమై ఆర్థిక స్థిరత్వానికి అనిశ్చితి తెస్తే, అదనపు సహాయ చర్యలు అవసరం అవుతాయని ఆమె అన్నారు. మొత్తం మీద పరిస్థితులు సర్దుకుంటున్నాయని మంగళవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. బ్యాంకుపై అనుమానాలతో ఖాతాదార్లు తమ డిపాజిట్లలను ఒక్కసారిగా ఉపసంహరించుకోవడంతో ఈనెల 10న కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ) కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూయార్క్‌కు చెందిన సిగ్నేచర్‌ బ్యాంక్‌ సైతం అదే దారిలో నడిచింది. ఈ జాబితాలో మూడో బ్యాంకుగా ‘ఫస్ట్‌ రిపబ్లిక్‌’ కూడా  చేరేదే కానీ.. 11 దిగ్గజ బ్యాంకులు నిధుల సహాయాన్ని చేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని