RBI: మనం మందగమనంలోకి వెళ్లబోం: ఆర్‌బీఐ వ్యాసం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తరహాలో భారత్‌ మందగమనం పాలు కాబోదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యాసం పేర్కొంది.

Updated : 22 Mar 2023 07:50 IST

ముంబయి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తరహాలో భారత్‌ మందగమనం పాలు కాబోదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యాసం పేర్కొంది. 2022-23లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తున్నామని తెలిపింది. ‘ఎన్ని అడ్డంకులున్నా.. భారత్‌ వృద్ధిపై ఆశావహంగానే ఉన్నట్లు’ ఆర్‌బీఐ మార్చి బులిటెన్‌లో ప్రచురితమైన వ్యాసం వెల్లడించింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే.. పలు దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉందని   తెలిపింది. ‘ప్రపంచమంతా సవాలుభరిత వాతావరణంలోకి ప్రవేశిస్తున్నా.. భారత్‌ తన దేశీయ అంశాలపై బలమైన విశ్వాసంతో ఉంది. 2023లో అంతర్జాతీయ వృద్ధి మందగమనం పాలవబోతున్నా.. లేదా మాంద్యంలోకి ప్రవేశించబోతున్నా.. భారత్‌ మాత్రం ముందుగా అంచనావేసిన దాని కంటే బలంగా ఉండనుంది. కొవిడ్‌ పరిణామాల నుంచి కోలుకోవడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి వృద్ధి స్థిరంగా కొనసాగుతోంద’ని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని