హ్యుందాయ్‌ వెర్నా కొత్త వెర్షన్‌

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ వెర్నాలో కొత్త వెర్షన్‌ను మంగళవారం దేశీయంగా పరిచయం చేసింది.

Published : 22 Mar 2023 01:41 IST

ప్రారంభ ధర రూ.10.89 లక్షలు

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ వెర్నాలో కొత్త వెర్షన్‌ను మంగళవారం దేశీయంగా పరిచయం చేసింది. వీటి ధరల శ్రేణి రూ.10.89-17.37 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. 1.5 లీటర్‌ ఇంజిన్‌ కలిగిన 6వ తరం వెర్నా ధరలు రూ.10.89-16.19 లక్షలు కాగా, 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.14.83-17.37 లక్షల (అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉన్నాయి. ఈ కార్లు ఇంజిన్‌ ఆధారంగా, లీటరుకు 18.6-20.6 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయని కంపెనీ తెలిపింది. 2006లో వెర్నా బ్రాండ్‌ను మన దేశంలో హ్యుందాయ్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈ మోడల్‌ కార్లు 4.65 లక్షలు దేశీయంగా విక్రయించగా, 4.5 లక్షలు ఎగుమతి చేసినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్‌ వెల్లడించారు. కొత్త వెర్షన్‌ వెర్నాలను కూడా ఎగుమతి చేస్తామని తెలిపారు. హోండా సిటీ, స్కోడా స్లేవియా, ఫోక్స్‌వ్యాగన్‌ వర్టుస్‌, మారుతీ సుజుకీ సియాజ్‌ కార్లతో దేశీయ విపణిలో కొత్త వెర్షన్‌ వెర్నా పోటీ పడబోతోందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు