Allu Arjun: అల్లు అర్జున్ బ్రాండ్ విలువ ఎంతో తెలుసా?
దేశంలో అత్యంత బ్రాండు విలువ కలిగిన అగ్రశ్రేణి 25 మంది జాబితాలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తొలిసారి చోటు సంపాదించుకున్నారు.
క్రోల్ జాబితా అగ్రశ్రేణి 25లో చోటు
ఈనాడు, హైదరాబాద్: దేశంలో అత్యంత బ్రాండు విలువ కలిగిన అగ్రశ్రేణి 25 మంది జాబితాలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తొలిసారి చోటు సంపాదించుకున్నారు. 2022 ఏడాదికి ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ’ నివేదికను ఆర్థిక సలహాల సంస్థ క్రోల్ విడుదల చేసింది. ఇందులో అగ్రశ్రేణి 25 మంది ప్రముఖుల బ్రాండు విలువ 160 కోట్ల డాలర్ల మేరకు ఉంది. 2021తో పోలిస్తే ఇది 29.1% పెరిగింది. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ రూ.1500 కోట్ల (18.17 కోట్ల డాలర్ల)తో తొలి స్థానంలో నిలిచారు. తర్వాత విరాట్ కోహ్లి రూ.1450 కోట్లు (17.69 కోట్ల డాలర్లు), అక్షయ్ కుమార్ రూ. 1260 కోట్లు (15.36 కోట్ల డాలర్లు), ఆలియా భట్ రూ. 850 కోట్లు(10.29 కోట్ల డాలర్లు), దీపికా పదుకోన్ రూ. 680 కోట్లు (8.29 కోట్ల డాలర్లు) ఉన్నారు. అల్లు అర్జున్ రూ.260 కోట్ల (3.14 కోట్ల డాలర్లు) బ్రాండు విలువతో 20వ స్థానంలో ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రూ.219 కోట్లతో(26.5 కోట్ల డాలర్లు) 23వ స్థానంలో, సినీ నటి రష్మిక మందన్న రూ.209 కోట్ల (25.3 కోట్ల డాలర్లు) బ్రాండు విలువతో 25వ స్థానంలో నిలిచారు. హార్ధిక్ పాండ్యా, ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా తొలిసారి ఈ జాబితాలో చోటు సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు