పద్మభూషణ్‌ పురస్కారం స్వీకరించిన కేఎం బిర్లా

ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా (55) బుధవారం పద్మభూషణ్‌ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

Published : 23 Mar 2023 01:41 IST

దిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా (55) బుధవారం పద్మభూషణ్‌ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. బిర్లా కుటుంబంలో ‘పద్మ’ అవార్డు అందుకున్న నాలుగో వ్యక్తి కేఎం బిర్లా. గతంలో ఆయన ముత్తాత జీడీ బిర్లా 1957లో పద్మవిభూషణ్‌ పురస్కారం స్వీకరించారు. కేఎం బిర్లా తల్లి రాజశ్రీ బిర్లా 2011లో పద్మభూషణ్‌ అందుకున్నారు. కేఎం బిర్లా తాత బీకే బిర్లా సోదరుడు జీపీ బిర్లా 2006లో పద్మభూషణ్‌ స్వీకరించారు. కుమార మంగళం బిర్లా 28 ఏళ్లపాటు ఆదిత్య బిర్లా గ్రూపు ద్వారా అందించిన సేవలకుగాను వాణిజ్య విభాగంలో  పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. రస్నా బ్రాండ్‌ వ్యవస్థాపకుడు అరీజ్‌ ఖంబట్టా, స్టాక్‌ మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వా సైతం మరణానంతరం ఈ ఏడాది వాణిజ్య విభాగంలో ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని