ఆరేళ్లలో రూ.1.11 లక్షల కోట్ల స్థిరాస్తులు స్వాధీనం
ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు గత ఆరేళ్లలో సుమారు రూ.1.11 లక్షల కోట్ల స్థిరాస్తుల్ని అటాచ్ చేశాయి.
పార్లమెంటుకు తెలిపిన ఆర్థిక శాఖ
దిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు గత ఆరేళ్లలో సుమారు రూ.1.11 లక్షల కోట్ల స్థిరాస్తుల్ని అటాచ్ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,683 కోట్ల స్థిరాస్తులను స్వాధీనంలోకి తీసుకున్నట్లు పార్లమెంటుకు ఆర్థిక శాఖ తెలిపింది. ఈడీ, డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను విభాగానికి చెందిన కేంద్ర సంస్థలు 204 కేసుల్లో ఈ ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు వివరించింది. 2021-22లో 1,657 కేసుల్లో రూ.19,832 కోట్ల స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ), కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) 2017-18 నుంచి 2021-22 మధ్య రూ.71 కోట్ల స్థిరాస్తులను విక్రయించాయి. స్థిరాస్తులను సీబీడీటీ, సీబీఐసీ స్వాధీనం చేసుకున్నా, వాటిని విక్రయించేందుకు కోర్టు అనుమతులు కావాల్సి ఉండటంతో ఆలస్యమవుతోందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ