స్పెషాలిటీ కెమికల్స్‌ వ్యాపారంలోకి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌

ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ వ్యాపారంలోకి విస్తరించనుంది. 

Published : 23 Mar 2023 01:41 IST

రెండేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ వ్యాపారంలోకి విస్తరించనుంది.  పారిశ్రామిక రసాయనాలు, సస్య రక్షణ రసాయనాలు సైతం ఉత్పత్తి చేయనుంది. దీని కోసం వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు, బుధవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఆమోదముద్ర లభించింది. సీడీఎంఓ (కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌) వ్యాపార కార్యకలాపాలు కూడా చేపట్టాలని కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా నిర్ణయించింది. ఎరువుల, సస్య రక్షణ ఉత్పత్తుల్లో ఎన్నో ఏళ్లుగా తమకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకుని, ఈ కొత్త విభాగాల్లో రాణించాలని ఆశిస్తున్నట్లు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ పేర్కొన్నారు. తద్వారా దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా అమ్మకాలు పెంచుకుంటామని వివరించారు. ఇందుకోసం కొత్త యూనిట్లు సిద్ధం చేస్తామని తెలిపారు. సీడీఎంఓ విభాగంలో వృద్ధి అవకాశాలు విశేషంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని