మళ్లీ అదనపు నిఘా కిందకు అదానీ పవర్‌ షేర్లు

అదానీ పవర్‌ షేర్లను మళ్లీ స్వల్పకాలం పాటు అదనపు నిఘా వ్యవస్థ (ఏఎస్‌ఎం) కిందకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ తీసుకొచ్చాయి.

Published : 24 Mar 2023 01:33 IST

దిల్లీ: అదానీ పవర్‌ షేర్లను మళ్లీ స్వల్పకాలం పాటు అదనపు నిఘా వ్యవస్థ (ఏఎస్‌ఎం) కిందకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ తీసుకొచ్చాయి. ‘మార్చి 23 నుంచి ఏఎస్‌ఎం స్టేజ్‌ 1 పరిధిలోకి అదానీ పవర్‌ను తీసుకొస్తున్నట్లు’ ఎక్స్ఛేంజీలు తెలిపాయి. అదానీ గ్రూపునకు చెందిన మరో రెండు కంపెనీలు- అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎన్‌డీటీవీ షేర్లను సోమవారమే దీర్ఘకాలిక ఏఎస్‌ఎం రెండో దశ నుంచి మొదటి దశకు ఎక్స్ఛేంజీలు మార్చాయి. 3 రోజుల వ్యవధిలోనే అదానీ పవర్‌ను కూడా ఏఎస్‌ఎం కిందకు ఎక్స్ఛేంజీలు తీసుకొచ్చాయి.
నీ షేర్ల ధరల్లో అధిక ఒడుదొడుకుల నేపథ్యంలో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ విల్మర్‌తో పాటు అదానీ పవర్‌ షేర్లను మార్చి 8న స్వల్పకాలిక ఏఎస్‌ఎం కిందకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తీసుకొచ్చాయి. మార్చి 17న మళ్లీ ఆంక్షలు తొలగించాయి.

* ఏఎస్‌ఎం పరిధిలోకి తీసుకు రావాలంటే.. గరిష్ఠ- కనిష్ఠాల వ్యత్యాసం, క్లయింట్ల ఆసక్తి, ప్రైస్‌ బ్యాండ్‌ హిట్స్‌ సంఖ్య, ముగింపు- ముగింపు ధరల వ్యత్యాసం, ప్రైస్‌- ఎర్నింగ్‌ రేషియో లాంటి వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగానే మళ్లీ అదానీ పవర్‌ను స్వల్పకాలిక ఏఎస్‌ఎం పరిధిలోకి తీసుకొచ్చినట్లు ఎక్స్ఛేంజీలు పేర్కొన్నాయి. ఏఎస్‌ఎం పరిధిలో ఉండే కంపెనీ షేర్లకు, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ముందస్తుగా 100 శాతం మార్జిన్‌  చెల్లించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని