ఏప్రిల్‌ నుంచి ధరలు పెంచుతాం.. మారుతీ సుజుకీ

ద్రవ్యోల్బణంతో పాటు బీఎస్‌-6 రెండోదశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల్లో మార్పులు చేసేందుకు అదనపు వ్యయాలు అవుతున్నందునే, వాహన ధరలు పెంచుతున్నామని కంపెనీలు ప్రకటిస్తున్నాయి.

Updated : 24 Mar 2023 04:30 IST

దిల్లీ: ద్రవ్యోల్బణంతో పాటు బీఎస్‌-6 రెండోదశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల్లో మార్పులు చేసేందుకు అదనపు వ్యయాలు అవుతున్నందునే, వాహన ధరలు పెంచుతున్నామని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. తమ వాహన ధరలను ఏప్రిల్‌ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గురువారం ప్రకటించింది. ఎంత శాతం పెంచనుందీ వెల్లడించలేదు. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఆధారపడి ఉంటుందని వివరించింది. ఏప్రిల్‌ నుంచి విక్రయించే వాహనాల్లో, ఉద్గార స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించే ఆన్‌-బోర్డ్‌ సెల్ఫ్‌ డయాగ్నొస్టిక్‌ పరికరం ఉండటం తప్పనిసరి. ఇప్పటికే టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌ కూడా తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

హోండా అమేజ్‌ ధర రూ.12,000 వరకు పెంపు: తమ ప్రారంభస్థాయి సెడాన్‌ కారు అమేజ్‌ ధరలను రూ.12,000 వరకు ఏప్రిల్‌ 1 నుంచి పెంచనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. ఈ మోడల్‌లో ఆయా ట్రిమ్‌ను బట్టి ధర పెంపు ఉంటుందని పేర్కొంది. మధ్యశ్రేణి సెడాన్‌ సిటీ మోడల్‌ ధరల్లో మార్పులు చేయడం లేదంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు