500 నగరాలకు ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు

5జీ సేవల విస్తరణలో టెలికాం ఆపరేటరు భారతీ ఎయిర్‌టెల్‌ దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా 235 నగరాలను ఈ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మొత్తం 500 నగరాల్లో తన 5జీ సేవలను విస్తరించినట్లయింది.

Published : 25 Mar 2023 02:43 IST

దిల్లీ: 5జీ సేవల విస్తరణలో టెలికాం ఆపరేటరు భారతీ ఎయిర్‌టెల్‌ దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా 235 నగరాలను ఈ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మొత్తం 500 నగరాల్లో తన 5జీ సేవలను విస్తరించినట్లయింది. రిలయన్స్‌ జియో ఇప్పటిదాకా ప్రకటించిన దాని ప్రకారం.. 406 నగరాల్లో మాత్రమే 5జీ సేవలను ప్రారంభించింది. ‘దేశంలోని 500 నగరాల్లో ఎయిర్‌టెల్‌ వినియోగదార్లకు అత్యంత వేగవంతమైన 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయ’ని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజూ 30-40 నగరాలను 5జీ నెట్‌వర్క్‌కు జత చేస్తున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని