ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆదాయాల్లో 10-11% వృద్ధి

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆదాయం 10-11 శాతం వృద్ధి చెందొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదికలో అంచనా వేసింది.

Published : 25 Mar 2023 02:43 IST

క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక

ముంబయి: 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆదాయం 10-11 శాతం వృద్ధి చెందొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదికలో అంచనా వేసింది. దేశీయ గిరాకీ, ఔషధ పర్యాటకం పుంజుకోవడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. పడకల భర్తీ, భర్తీ అయిన పడకలపై సగటు ఆదాయం స్థిరంగా ఉండటం కూడా ప్రైవేట్‌ ఆసుపత్రులకు కలిసొస్తున్నట్లు వెల్లడించింది. 2021-22లో కొవిడ్‌-19 రెండో దశ విజృంభణ కారణంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు రికార్డు స్థాయిలో అధిక నిర్వహణ లాభాన్ని నమోదుచేశాయి. ఆ సమయంలో ఆక్యుపెన్సీ కూడా గరిష్ఠ స్థాయిలకు చేరింది. అనంతరం ఆరోగ్య అవగాహన పెరగడం, ఇతర కారణాలతో పడకల భర్తీ స్థిరంగా 60 శాతం వద్దే కొనసాగుతున్నట్లు క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనూజ్‌ సేథీ తెలిపారు. మొదటి దశలో లాక్‌డౌన్‌ కారణంగా మాత్రమే ఆక్యుపెన్సీ 53 శాతానికి తగ్గినట్లు గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని