ఐఫోన్ల తయారీకి భారత్‌లో పెగట్రాన్‌ మరో ఫ్యాక్టరీ

యాపిల్‌ ఫోను తయారు చేసే కంపెనీలు ఒక్కొక్కటిగా చైనా నుంచి బయటకు వస్తున్నాయి.

Published : 25 Mar 2023 02:43 IST

దిల్లీ: యాపిల్‌ ఫోను తయారు చేసే కంపెనీలు ఒక్కొక్కటిగా చైనా నుంచి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తుండగా.. అదే దేశానికి చెందిన మరో సంస్థ పెగట్రాన్‌ సైతం భారత్‌లో తన రెండో ప్లాంటును తెరవాలని చూస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలికి తరలించాలన్న యాపిల్‌ భావిస్తున్న వేళ పెగట్రాన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెగట్రాన్‌ 150 మిలియన్‌ డాలర్లతో తమిళనాడులోని చెన్నైకి సమీపంలో తొలి యాపిల్‌ ఫోన్ల తయారీ కేంద్రాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తొలి ప్లాంటును నెలకొల్పింది. ఇక్కడే మరో ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు