జీలకర్రలో కొనుగోళ్లు

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.60,356 స్థాయిని అధిగమిస్తే రూ.60,879;    రూ.61,402 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రూ.58,886 కంటే కిందకు వస్తే రూ.58,363; రూ.57,889వరకు పడిపోవచ్చు.

Updated : 27 Mar 2023 02:37 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.60,356 స్థాయిని అధిగమిస్తే రూ.60,879;    రూ.61,402 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రూ.58,886 కంటే కిందకు వస్తే రూ.58,363; రూ.57,889వరకు పడిపోవచ్చు. లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు   రూ.58,363కు స్టాప్‌లాస్‌ను సవరించుకుని, వాటిని కొనసాగించడం మంచిదే.


వెండి

వెండి మే కాంట్రాకుకు రూ.68,685 ఎగువన స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.69,665; రూ.70,004 సమీపంలో లాంగ్‌ పొజిషన్లను తీసుకోవడం మంచి వ్యూహమే అవుతుంది.


ప్రాథమిక లోహాలు

* రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈరోజు రూ.772.10 ఎగువన నిలదొక్కుకుంటే..   రూ.776; రూ.788 వరకు రాణిస్తుందని భావించవచ్చు.

* సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.184.90 కంటే పైన కదలాడకుంటే, ప్రతికూల ధోరణికి అవకాశం ఉంటుంది. రూ.181 స్థాయికి దిగువన కాంట్రాక్టు బలహీనంగానే కదలాడొచ్చు.

* జింక్‌ మార్చి కాంట్రాక్టు రూ.254 దిగువన ముగిస్తే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల రూ.264 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిదే.

* అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.202 కంటే దిగువన కదలాడకుంటే.. లాంగ్‌పొజిషన్లు కొనసాగించడం మేలే.


ఇంధన రంగం

* ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు  రూ.5,379 కంటే దిగువన  చలించకుంటే.. రూ.5,992; రూ.6,123 వరకు రాణిస్తుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలో రూ.5,301 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. అదేవిధంగా రూ.5,992 కంటే పైకి వెళ్లకుంటే.. రూ.6,123 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవడం మంచి వ్యూహం అవుతుంది.

* సహజవాయువు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.185 దిగువకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.6,605 కంటే దిగువన చలించకుంటే.. రూ.7,127 వరకు రాణిస్తుందని భావించవచ్చు. అందువల్ల రూ.6,598 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, ధర తగ్గినప్పుడల్లా లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడం మంచి వ్యూహమే అవుతుంది.

* జీలకర్ర ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.35,976 స్థాయిని అధిగమిస్తే రూ.36,520ను పరీక్షించవచ్చు. రూ.37,063 వరకు వెళ్లే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో స్టాప్‌లాస్‌ను సవరించుకుని, లాంగ్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవడం మంచి వ్యూహమే అవుతుంది.

* ధనియాలు మే కాంట్రాక్టుకు, అధిక స్థాయిల వద్ద కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.6,916 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.6,743 వరకు పడిపోవచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు