పాన్‌ మసాలా, పొగాకుపై జీఎస్‌టీ సెస్‌కు పరిమితి

పాన్‌ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వసూలు చేస్తున్న జీఎస్‌టీ పరిహార సెస్‌పై ప్రభుత్వం గరిష్ఠ పరిమితి విధించింది. వీటి రిటైల్‌ విక్రయ ధరపై, అత్యధిక రేటును నిర్ణయించింది.

Published : 27 Mar 2023 01:57 IST

దిల్లీ: పాన్‌ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వసూలు చేస్తున్న జీఎస్‌టీ పరిహార సెస్‌పై ప్రభుత్వం గరిష్ఠ పరిమితి విధించింది. వీటి రిటైల్‌ విక్రయ ధరపై, అత్యధిక రేటును నిర్ణయించింది. 2023 ఆర్థిక బిల్లు సవరణల్లో సెస్‌ రేటుపై పరిమితిని ప్రతిపాదించగా, గత శుక్రవారం లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం పాన్‌ మసాలా ప్రతి యూనిట్‌ రిటైల్‌ విక్రయ ధరలో, గరిష్ఠ జీఎస్‌టీ పరిహార సెస్‌ రేటు 51 శాతంగా ఉంది. ప్రస్తుత విధానంలో విలువలో 135 శాతం సెస్‌ను వసూలు చేస్తున్నారు. వెయ్యి పొగాకు స్టిక్స్‌ రూ.4170 లేదా యూనిట్‌పై రిటైల్‌ ధరలో 100 శాతం సెస్‌ నిర్ణయించారు. ప్రస్తుతం ఇది రూ.4170 లేదా విలువలో 290 శాతంగా ఉంది. జీఎస్‌టీ విధానంలో అత్యధిక పన్ను రేటు అయిన 28 శాతం కంటే ఎక్కువగానే ఇప్పటివరకు సెస్‌ ఉంది.

ఎక్స్‌-రే మెషీన్లపై దిగుమతి సుంకం పెంపు: ఎక్స్‌-రే మెషీన్లు, నాన్‌-పోర్టబుల్‌ ఎక్స్‌-రే జనరేటర్ల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం 15 శాతానికి పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఎక్స్‌-రే మెషీన్లు, నాన్‌-పోర్టబుల్‌ ఎక్స్‌-రే జనరేటర్ల దిగుమతిపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు