టీసీఎస్‌ రాజన్నకు జీవితకాల సాఫల్య పురస్కారం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రాంతీయ అధిపతి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్నను, హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ‘జీవితకాల సాఫల్య పురస్కారం’తో సత్కరించింది.

Published : 27 Mar 2023 01:58 IST

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రాంతీయ అధిపతి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్నను, హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ‘జీవితకాల సాఫల్య పురస్కారం’తో సత్కరించింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన రాజన్న, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగ పురోభివృద్ధికి తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నందునే ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ తెలిపింది. పరిశ్రమ అభివృద్ధి, నైపుణ్యాల పెంపునకు నిర్విరామంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజన్న పేర్కొన్నారు. - హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు