స్థిరాస్తి రంగంలోకి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు

దేశీయ స్థిరాస్తి రంగంలోకి గత అయిదేళ్ల కాలంలో దాదాపు 32 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ మూలధన పెట్టుబడులు వచ్చాయని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది.

Updated : 28 Mar 2023 02:26 IST

2023-24పై సీబీఆర్‌ఈ అంచనాలు

దిల్లీ: దేశీయ స్థిరాస్తి రంగంలోకి గత అయిదేళ్ల కాలంలో దాదాపు 32 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ మూలధన పెట్టుబడులు వచ్చాయని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. 2023-24లో ఈ రంగం దాదాపు 12-13 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.98,400-1,06,600 కోట్లు) మేరకు పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని పేర్కొంది. ఏడాదికి సగటున 6-7 బిలియన్‌ డాలర్ల వరకూ రావచ్చని పేర్కొంది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, సంస్థాగత పెట్టుబడిదారులు, స్థిరాస్తి డెవలపర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌, కార్పొరేట్‌ గ్రూప్‌, రీట్స్‌ నుంచి ఈ పెట్టుబడులు వస్తాయని పేర్కొంది. ఆఫీసు స్థలాలకు అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉందని, పరిశ్రమలు, లాజిస్టిక్స్‌ స్థలాలు తర్వాత స్థానంలో ఉంటాయని వెల్లడించింది. చైనా+1 విధానం వల్ల దేశీయ స్థిరాస్తి రంగానికి మంచి అవకాశాలున్నట్లు సీబీఆర్‌ఈ ఛైర్మన్‌, సీఈఓ- ఇండియా అన్షుమన్‌ మ్యాగజైన్‌ తెలిపారు. రానున్న రెండేళ్ల కాలంలో మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలకు అధికంగా పెట్టుబడులు వస్తాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు