అపార్ట్‌మెంట్లకు గిరాకీ పెరుగుతోంది

సొంతింటితో పోలిస్తే అగ్రశ్రేణి నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు ఎక్కువ గిరాకీ ఉంటోందని హౌసింగ్‌.కామ్‌ నివేదిక వెల్లడించింది.

Published : 28 Mar 2023 01:42 IST

హౌసింగ్‌.కామ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: సొంతింటితో పోలిస్తే అగ్రశ్రేణి నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు ఎక్కువ గిరాకీ ఉంటోందని హౌసింగ్‌.కామ్‌ నివేదిక వెల్లడించింది. ఇందులోనూ రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉన్న కొత్త ఫ్లాట్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. ఏడాది కాలంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుత త్రైమాసికంలోనూ ఇళ్ల అమ్మకాలు అధికంగానే ఉన్నాయని హౌసింగ్‌.కామ్‌ గ్రూపు సీఈఓ ధ్రువ్‌ అగర్వాలా తెలిపారు. భారతీయ నివాస గృహాల మార్కెట్‌ భవిష్యత్తులోనూ వృద్ధి చెందేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2022లో రూ.1-2 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్ల కోసం ఆరా తీసిన వారు 24 శాతం పెరిగారని తెలిపారు. ఇళ్లను అద్దెకు తీసుకోవాలని చూసిన వారి సంఖ్యా 2022లో 1.5 రెట్లు పెరిగింది. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లలో ఈ సంఖ్య అధికంగా ఉందని నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని