హెరిటేజ్‌ ఫుడ్స్‌ నుంచి కొత్త ఉత్పత్తులు

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ‘ఏ-వన్‌’ అనే బ్రాండు పేరుతో కొన్ని బటర్‌మిల్క్‌ ఉత్పత్తులను, కొత్త రకం మిల్క్‌షేక్‌ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

Published : 28 Mar 2023 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ‘ఏ-వన్‌’ అనే బ్రాండు పేరుతో కొన్ని బటర్‌మిల్క్‌ ఉత్పత్తులను, కొత్త రకం మిల్క్‌షేక్‌ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మసాలా రుచులతో బటర్‌మిల్క్‌ ఉత్పత్తులను 180 ఎంఎల్‌ ప్యాక్‌లో రూ.20 ప్రారంభ ధరకు అందిస్తున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ పేర్కొంది. అదే విధంగా కొత్త తరహా ప్యాక్‌లు, రుచులతో మిల్క్‌షేక్‌ ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు వివరించింది. దీంతో తమ ‘వాల్యూ యాడెడ్‌’ ఉత్పత్తుల శ్రేణి విస్తరించినట్లు అవుతుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) నారా బ్రాహ్మణి అన్నారు. ఈ వేసవిలో మరికొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు అందిస్తామని ఆమె అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని