హెచ్‌డీఎఫ్‌సీ రూ.57,000 కోట్ల సమీకరణ

తనఖా రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ దశల వారీగా మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.57,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సోమవారం నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది.

Published : 28 Mar 2023 01:45 IST

మార్పిడి రహిత డిబెంచర్ల జారీ ద్వారా
ఆమోదించిన బోర్డు

దిల్లీ: తనఖా రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ దశల వారీగా మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.57,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సోమవారం నియంత్రణ సంస్థలకు సమాచారమిచ్చింది. దీనికి 2022 జూన్‌ 30న నిర్వహించిన 45వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో వాటాదార్లు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. అప్పులు తీసుకునే సామర్థ్యాన్ని కూడా రూ.6 లక్షల కోట్ల నుంచి రూ.6.5 లక్షల కోట్లకు పెంచుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించింది.

* వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి తమ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అవుతుందని అంచనా వేస్తోంది. భారతీయ కార్పొరేట్‌ చర్రితలోనే అతి పెద్ద లావాదేవీని 2022 ఏప్రిల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 బిలియన్‌ డాలర్ల ఒప్పందం ఇది. ప్రతిపాదిత విలీన సంస్థ సంయుక్త ఆస్తుల విలువ సుమారు రూ.18 లక్షల కోట్లకు చేరుతుంది.

* ఈ విలీన ఒప్పందం ఒకసారి అమల్లోకి వస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత వాటాదార్లకు 41 శాతం వాటా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ వాటాదార్లు ప్రతీ 25 షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లను పొందుతారు. విలీనం తర్వాత బ్యాలెన్స్‌ షీట్‌ రూ.17.87 లక్షల కోట్లకు, నికర విలువ రూ.3.3 లక్షలకు చేరే అవకాశం ఉంది. 2022 ఏప్రిల్‌ 1 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.8.36 లక్షల కోట్లు (110 బి.డాలర్లు), హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ.4.46 లక్షల కోట్లు (59 బి.డాలర్లు)గా ఉంది.

* విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పరిమాణం ఐసీఐసీఐ బ్యాంక్‌కు రెట్టింపు అవుతుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని