చైనాలో అడుగుపెట్టిన జాక్‌ మా.. ఏడాదిన్నర తర్వాత స్వదేశానికి

చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల అధినేత, ఆసియా కుబేరుడు జాక్‌మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో అడుగు పెట్టారు.

Updated : 28 Mar 2023 04:35 IST

బీజింగ్‌: చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల అధినేత, ఆసియా కుబేరుడు జాక్‌మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో అడుగు పెట్టారు. 2021లో దేశాన్ని వీడిన జాక్‌మా.. ఆ తర్వాత ఇప్పుడే తొలిసారిగా చైనాలో అడుగుపెట్టారు. సోమవారం తూర్పు చైనాలోని హాంగ్‌జౌలో ఉన్న యుంగు పాఠశాలను జాక్‌ మా సందర్శించారు. ఆయన స్థాపించిన ఆ విద్యాసంస్థకు వెళ్లి.. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులతో కృత్రిమ మేథ, చాట్‌ జీపీటీ గురించి మాట్లాడినట్లు తెలిసింది. నేర్చుకోవడం పట్ల తనకున్న ఆసక్తులను విద్యార్థులతో పంచుకున్నట్లు  సమాచారం.

ప్రభుత్వంపై విమర్శలతో చిక్కుల్లో..:  2020లో ప్రభుత్వ విధానాలను విమర్శించింనందుకు చిక్కుల్లో పడ్డ జాక్‌మా.. చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిందుకుగాను చైనా దర్యాప్తు సంస్థలు జాక్‌మాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆర్థిక బలాన్ని విపరీతంగా దెబ్బకొట్టాయి. ఆ తర్వాత జాక్‌.. కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపించకుండా పోయారు. కమ్యూనిస్ట్‌ పార్టీని విమర్శించిన పలువురు చైనా ప్రముఖులు వరసగా అదృశ్యం కావడం వల్ల జాక్‌మాను కూడా ప్రభుత్వమే కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు చైనాలో అడుగు పెట్టడం వల్ల ఆ ఊహాగానాలకు తెరపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని