ఒకే వెబ్‌సైట్‌లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా టికెట్లు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ నుంచి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 29 Mar 2023 03:19 IST

దిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ నుంచి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సోమవారం నుంచే ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది అక్టోబరులో ఎయిరేషియాలో వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రెండు కంపెనీల బాధ్యతలను ఒకే సీఈఓ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించిన టికెట్‌ బుకింగ్‌ ఎయిరిండియాఎక్స్‌ప్రెస్‌.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిరేషియా, విస్తారా విమానయాన సంస్థలను టాటా గ్రూప్‌ నిర్వహిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని