Blue Tick: ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రామ్‌.. బ్లూ టిక్‌కు ఛార్జీలు

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌.. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం విధించే ఛార్జీలను మాతృసంస్థ మెటా వెల్లడించింది. మొబైల్‌ యాప్‌లకు, డెస్క్‌టాప్‌ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది.

Updated : 30 Mar 2023 09:59 IST

దిల్లీ: భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌.. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం విధించే ఛార్జీలను మాతృసంస్థ మెటా వెల్లడించింది. మొబైల్‌ యాప్‌లకు, డెస్క్‌టాప్‌ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది. మొబైల్‌ యాప్‌ ద్వారా ఫేస్‌బుక్‌ వాడితే నెలకు రూ.1,450 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. డెస్క్‌టాప్‌ బ్రౌజర్ల వినియోగదారులు నెలకు రూ.1,099 చెల్లించాలని వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికాలో మాత్రమే ఈ బ్లూ టిక్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయులు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ కావాలనుకుంటే మెటా వెరిఫైడ్‌ కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో చేరవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని