రూ.1,337.76 కోట్ల జరిమానాను గూగుల్‌ కట్టాల్సిందే

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను గూగుల్‌ చెల్లించాల్సిందేనని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది.

Published : 30 Mar 2023 01:49 IST

సీసీఐ ఆదేశాలను సమర్థించిన ఎన్‌సీఎల్‌ఏటీ

దిల్లీ: కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను గూగుల్‌ చెల్లించాల్సిందేనని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విషయంలో అనైతిక పోటీ విధానాలను అనుసరిస్తోందంటూ గూగుల్‌కు గతేడాది అక్టోబరు 20న సీసీఐ ఈ జరిమానాను విధించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీని గూగుల్‌ ఆశ్రయించింది. అయితే సీసీఐ ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ ద్విసభ్య ధర్మాసనం కూడా సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. సీసీఐ విధించిన జరిమానా చెల్లించేందుకు 30 రోజుల సమయాన్ని గూగుల్‌కు ఇచ్చింది. అలాగే మిగిలిన ఆదేశాలను కూడా 30 రోజుల్లోగా పాటించాలని తెలిపింది. ‘సీసీఐ జరిమానా తీర్పును సమర్థిస్తున్నాం. గతంలో జనవరి 4న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే గూగుల్‌ చెల్లించిన 10 శాతాన్ని మినహాయించి.. మిగిలిన జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్‌ చేయాల’ని ఎన్‌సీఎల్‌ఏటీ తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే 2022, అక్టోబరు 20న సీసీఐ జారీ చేసిన ఆదేశాల్లో కొన్ని మార్పులను కూడా చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని