30 కోట్ల ఉద్యోగాలపై కృత్రిమ మేధ ప్రభావం
కృత్రిమ మేధలో ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధలో ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ కూడా తాజా నివేదికలో ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతలో వస్తోన్న నూతన పోకడలు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ‘ఆర్థిక ప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ నివేదికలో గోల్డ్‌మాన్ శాక్స్ ఈ అంశాలు వెల్లడించింది.
* కృత్రిమ మేధ అంచనాలకు అనుగుణంగా తన ఉత్పాదక సామర్థ్యాలను నెరవేరిస్తే శ్రామిక రంగంలో మాత్రం ఒడుదొడుకులుంటాయి. అమెరికా, ఐరోపాల్లో వృత్తిపరమైన పనుల సమాచారాన్ని విశ్లేషించి చూస్తే అక్కడ ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో మూడో వంతు ఆటోమేషన్‌కు ప్రభావితమవుతాయి.
* సాంకేతికత పురోగతి అంటేనే కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్పాదకతకు మరింత ఊతం. తద్వారా ప్రపంచ జీడీపీని 7 శాతానికి పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని అంచనా వేసింది.
* చాట్‌జీపీటీ వంటి అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థలు మానవుల్లానే కంటెంట్‌ను సృష్టించగలవని.. వచ్చే దశాబ్దకాలంలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.
* కృత్రిమ మేధ వల్ల కార్యనిర్వహణ, న్యాయ రంగాల్లోని ఉద్యోగాలపై అత్యధిక ప్రభావం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 46 శాతం, లీగల్ ఉద్యోగాల్లో 44 శాతం ముప్పు పొంచి ఉంది. నిర్వహణ, ఇన్‌స్టలేషన్, మరమ్మతు, నిర్మాణ రంగ ఉద్యోగాలకు మాత్రం తక్కువ ప్రభావం ఉండనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Indian Railway-Kishan Reddy: కిషన్‌రెడ్డి చొరవ.. తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్
-
Politics News
KTR: భాజపా, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి: మంత్రి కేటీఆర్
-
Sports News
Ruturaj Gaikwad: రెండు రోజుల్లో పెళ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఫియాన్సీ ఎవరంటే..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 15 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు.. ఏవి ఎక్కడంటే?
-
World News
Kyiv: కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ముగ్గురి మృతి
-
Politics News
YS Sharmila: భారాసతో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోం: వైఎస్ షర్మిల