జోస్‌ అలుక్కాస్‌కు ప్రచారకర్తలుగా ఆర్‌.మాధవన్‌, కీర్తి సురేశ్‌

ఆభరణాల విక్రయ సంస్థ జోస్‌ అలుక్కాస్‌కు ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌,   దక్షిణాది భాషా చిత్రాల హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ప్రచారకర్తలుగా (బ్రాండ్‌ అంబాసిడర్‌) వ్యవహరించనున్నారు.

Published : 30 Mar 2023 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆభరణాల విక్రయ సంస్థ జోస్‌ అలుక్కాస్‌కు ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌,   దక్షిణాది భాషా చిత్రాల హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ప్రచారకర్తలుగా (బ్రాండ్‌ అంబాసిడర్‌) వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జోస్‌ అలుక్కాస్‌ వెల్లడించింది. జోస్‌ అలుక్కాస్‌ దేశవ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలలో కార్యకలాపాలు సాగిస్తోంది. జోస్‌ అలుక్కాస్‌ వంటి ప్రముఖ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మాధవన్‌, కీర్తి సురేశ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని