ప్రమాదంలో ప్రభుత్వ వెబ్‌సైట్లు!

మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్ల(డొమైన్లు)కు సరైన భద్రతా ఏర్పాట్లు లేవని సెక్యూరిన్‌ ఇంక్‌., ఇవాంటి సంస్థల సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఎన్నో భద్రతా లోపాలు కనిపించాయని ఈ సంస్థలు వివరించాయి.

Published : 30 Mar 2023 01:53 IST

సైబర్‌ నేరగాళ్లు దాడి చేసే అవకాశాలు
కనీస భద్రతా చర్యలు లేకపోవడం వల్లే
సెక్యూరిన్‌ ఇంక్‌, ఇవాంటి అధ్యయనంలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

న దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్ల(డొమైన్లు)కు సరైన భద్రతా ఏర్పాట్లు లేవని సెక్యూరిన్‌ ఇంక్‌., ఇవాంటి సంస్థల సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఎన్నో భద్రతా లోపాలు కనిపించాయని ఈ సంస్థలు వివరించాయి. ‘సెక్యూరిన్‌ అటాక్‌ సర్ఫేస్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌’ను ఉపయోగించి వివిధ వెబ్‌సైట్లను విశ్లేషించినప్పుడు ఈ లోపాలు వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి. ఈ విశ్లేషణ ప్రకారం...

* వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక వెబ్‌సైట్లలో 10 శాతం సైట్లకు ప్రాథమిక భద్రతా కవచమైన సెక్యూర్‌ సాకెట్స్‌ లేయర్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌) ఎన్‌క్రిప్షన్‌ లేదు. ఎస్‌ఎస్‌ఎల్‌ ఎన్‌క్రిప్షన్‌ లేకపోతే హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్లు పెద్దఎత్తున ఈ సైట్ల మీద దాడిచేసే అవకాశం ఉంటుంది.

* వందల సంఖ్యలో సెన్సిటివ్‌ ప్రోటోకాల్స్‌ ఇంటర్‌నెట్‌కు ‘ఎక్స్‌పోజ్‌’ అయి ఉన్నాయి. ఇటువంటి 293 ఎస్‌ఎస్‌హెచ్‌ ఉదంతాలను, 67 ఎఫ్‌టీపీ సందర్భాలను గుర్తించారు.

* దాదాపు 700లకు పైగా క్రెడెన్షియల్స్‌, పాస్‌వర్డ్‌లు లీక్‌ అయ్యాయి. దీనివల్ల ఈ వెబ్‌సైట్లపై ఫిషింగ్‌ అటాక్స్‌ జరిగే అవకాశం ఉంటుంది. దుర్వినియోగం జరగవచ్చు కూడా.

* దాదాపు 537 సందర్భాల్లో రాన్సమ్‌వేర్‌ దాడులు నమోదయ్యాయి.

వెబ్‌సైట్లకు కనీస భద్రతా చర్యలు పాటించని పక్షంలో తీవ్రమైన స్థాయిలో సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉంటుందని ఇవాంటి చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ ముక్కామల పేర్కొన్నారు.  అందువల్ల అన్ని ప్రభుత్వాలు, సంస్థలు తమ వెబ్‌సైట్లకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత నెలలో విడుదలైన ‘2023 స్పాట్‌లైట్‌ రిపోర్ట్‌’ ప్రకారం 2019 నుంచి ప్రపంచ వ్యాప్తంగా రాన్సమ్‌వేర్‌ దాడులు 503 శాతం పెరిగాయి. మనదేశంలో ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్లపై గత ఏడాదిలో అత్యధిక సంఖ్యలో సైబర్‌ దాడులు జరిగినట్లు సెక్యూరిన్‌ ఇంక్‌. ఛైర్మన్‌ రామ్‌ మొవ్వ తెలిపారు. సైబర్‌ భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ అలక్ష్యం చేయరాదని ఈ విషయం స్పష్టం చేస్తుందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు