గోద్రేజ్‌ కేపిటల్‌తో ఎస్‌బీఐ జట్టు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో తన భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు వ్యూహాత్మక అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎంఓయూ) గోద్రేజ్‌ కేపిటల్‌ కుదుర్చుకుంది.

Published : 31 Mar 2023 01:13 IST

రుణ పథకాల సేవల్లో సహకారం

ముంబయి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో తన భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు వ్యూహాత్మక అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎంఓయూ) గోద్రేజ్‌ కేపిటల్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ రుణ పథకాల సొల్యూషన్ల విషయంలో గోద్రేజ్‌ కేపిటల్‌కు ఎస్‌బీఐ సహకారం అందివ్వనుంది. గోద్రేజ్‌ కేపిటల్‌.. గోద్రేజ్‌ గ్రూపునకు చెందిన ఆర్థిక సేవల సంస్థ. తాజా ఒప్పందం అనంతరం దేశ అభివృద్ధిలో తమ పాత్ర మరింత పెరుగుతుందనే ఆశాభావాన్ని ఎస్‌బీఐ, గోద్రేజ్‌ గ్రూపు వ్యక్తం చేస్తున్నాయి. ‘రుణాలు పొందడాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభంగా చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అందరికీ ఆర్థిక సేవలను దరి చేర్చేందుకూ తోడ్పడటం ద్వారా భారత వృద్ధి గాథను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడనుంద’ని గోద్రేజ్‌ కేపిటల్‌ ఛైర్‌పర్సన్‌ పిరోజ్‌షా గోద్రేజ్‌ తెలిపారు. ఇరు సంస్థల శక్తిసామర్థ్యాలను అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారులను సాధికారికత వైపు నడిపించేందుకు వీలవుతుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు