విప్రో భారత, ఆగ్నేయాసియా అధిపతిగా బద్రి శ్రీనివాసన్‌

ఐటీ సేవల కంపెనీ విప్రో భారత్‌, ఆగ్నేయాసియా వ్యాపారాల అధిపతిగా బద్రి శ్రీనివాసన్‌ నియమితులయ్యారు.

Published : 31 Mar 2023 01:13 IST

దిల్లీ: ఐటీ సేవల కంపెనీ విప్రో భారత్‌, ఆగ్నేయాసియా వ్యాపారాల అధిపతిగా బద్రి శ్రీనివాసన్‌ నియమితులయ్యారు. కంపెనీని మరింత ముందుకు నడిపించేందుకు ఈ రెండు ప్రాంతాల నాయకత్వాన్ని శ్రీనివాసన్‌కు అప్పగించినట్లు విప్రో తెలిపింది. ఖాతాదారులకు అవసరమైన సేవలు, విప్రో సామర్థ్యాలను వినియోగించుకోవడంతో పాటు అవకాశాలను అందింపుచ్చుకోవడంలో ఆయనకు నైపుణ్యం ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఏపీఎంఈఏ (ఆసియా పసిఫిక్‌, మధ్య ప్రాచ్య, భారత్‌, ఆఫ్రికా) వ్యూహాత్మక మార్కెటింగ్‌ యూనిట్‌ కింద బద్రి శ్రీనివాసన్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు. 2022 జనవరిలో ఆగ్నేయాసియా ఎండీగా శ్రీనివాసన్‌ విప్రోలో చేరారు. విప్రో వ్యూహాత్మక అనుబంధ సంస్థల బోర్డులో సభ్యుడిగా సైతం కొనసాగుతున్నారు.

* ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఎండీ, సీఈఓగా దీపక్‌ శర్మను నియమితులయ్యారు. మే 1, 2023 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

* హీరో మోటోకార్ప్‌ తన కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా నిరంజన్‌ గుప్తాను నియమించింది. మే 1, 2023 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది.

* టాటా పవర్‌ తన సీఈఓ, ఎండీగా ప్రవీణ్‌ సిన్హాను మే 1, 2023 నుంచి ఏప్రిల్‌ 30, 2027 వరకు నాలుగేళ్ల పాటు కొనసాగించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని