రొమేనియాలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,000 నియామకాలు

ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రొమేనియాలో వచ్చే రెండేళ్లలో 1,000 మందిని నియమించుకుంటామని తెలిపింది.

Published : 31 Mar 2023 01:13 IST

దిల్లీ: ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రొమేనియాలో వచ్చే రెండేళ్లలో 1,000 మందిని నియమించుకుంటామని తెలిపింది. ఆ దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ గత 5 ఏళ్లుగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం సుమారు 1,000 మంది డిజిటల్‌, క్లౌడ్‌, ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో ఇక్కడ పని చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని