అరుదైన వ్యాధుల ఔషధాలకు దిగుమతి సుంకం మినహాయింపు

అరుదైన వ్యాధుల చికిత్స నిమిత్తం వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేకంగా దిగుమతి చేసుకునే అన్ని ఔషధాలు, ఆహారంపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం మినహాయించింది.

Published : 31 Mar 2023 01:12 IST

దిల్లీ: అరుదైన వ్యాధుల చికిత్స నిమిత్తం వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేకంగా దిగుమతి చేసుకునే అన్ని ఔషధాలు, ఆహారంపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం మినహాయించింది. ఈ దిగుమతి సుంకం రద్దు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. పలు రకాల కేన్సర్‌ల చికిత్సలో వాడే పెంబ్రోలిజుమాబ్‌(కీట్రూడా)పై కూడా బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించింది. సాధారణంగా ఔషధాలపై 10 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం విధిస్తున్నారు. కొన్ని ప్రాణాధార ఔషధాలు/వ్యాక్సిన్‌లపై 5 శాతం లేదా సున్నా పన్ను ఉంది. 2021లో తీసుకొచ్చిన జాతీయ విధానంలో గుర్తించిన అరుదైన వ్యాధులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. రోగి వ్యాధి బట్టి ప్రత్యేక పోషకాలు లభించేందుకు రూపొందించే ఆహారాన్ని ప్రత్యేక అవసరాల విభాగంలో విభజించారు. పన్ను మినహాయింపు పొందాలంటే రాష్ట్ర, కేంద్ర ఆర్యోగ సేవలు, జిల్లా ఔషధ అధికారి, సివిల్‌ సర్జన్‌ నుంచి వ్యక్తిగత దిగుమతిదారు పొందిన ధ్రువీకరణపత్రాన్ని(సర్టిఫికెట్‌)ను సమర్పించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని