ఆర్థిక సేవల రంగంలో మహిళలకు అవకాశాలెన్నో
ఆర్థిక సేవల రంగంలో మహిళలకు అపార అవకాశాలున్నాయని మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ అన్నారు.
మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్
పూర్తి మహిళా సిబ్బందితో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శాఖ ప్రారంభం
హైదరాబాద్ (ముషీరాబాద్), న్యూస్‌టుడే: ఆర్థిక సేవల రంగంలో మహిళలకు అపార అవకాశాలున్నాయని మార్గదర్శి చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న అరుంధతీ భట్టాచార్య, శిఖాశర్మ, శ్యామలా గోపీనాథ్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని, మహిళలు మెరుగైన స్థాయికి చేరేందుకు ప్రయత్నించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నూతన శాఖను శైలజాకిరణ్ ప్రారంభించి, ప్రసంగించారు. కష్టానికి మించిన ప్రత్యామ్నాయం లేదని.. మంచి సంస్థలో ఉన్నప్పుడు, మరింత కష్టపడితే ఉన్నత స్థానాలను అందుకునేందుకు ఎన్నో అవకాశాలుంటాయని శైలజా కిరణ్ ఉద్బోధించారు. మహిళలను ప్రోత్సహించే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే శాఖను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో 8వేలకు పైగా శాఖలు, 2లక్షల మందికి పైగా ఉద్యోగులతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులకు అత్యున్నత సేవలు అందిస్తుండటం ప్రశంసనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ప్రముఖ 10 సంస్థల్లో ఈ బ్యాంక్ ఒకటిగా నిలువనుందని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ హెడ్ టీవీఎస్ రావు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతోనే పూర్తి మహిళా సిబ్బంది శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కొత్త శాఖ ద్వారా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలతోపాటు, గృహ, వాహన, విద్యా రుణాలు, ఎస్‌ఎంఈ రుణాలనూ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్ రీజనల్ హెడ్ రాఘవ గోపీకృష్ణ, అశోక్‌నగర్ శాఖ మేనేజర్ శిల్పా రాగేరి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు