ఏప్రిల్‌- ఫిబ్రవరిలో ద్రవ్యలోటు రూ.14.53 లక్షల కోట్లు

గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్‌- ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.14.53 లక్షల కోట్లుగా నమోదైంది.

Published : 01 Apr 2023 02:34 IST

వార్షిక లక్ష్యంలో 82.8 శాతమిది

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్‌- ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.14.53 లక్షల కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యమైన రూ.17.55 లక్షల కోట్ల (జీడీపీలో 6.4%)లో ఇది 82.8 శాతానికి సమానం. వ్యయాలు, ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. 2021-22లో ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ లక్ష్యంలో 82.7 శాతంగా ఉంది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022-23 తొలి 11 నెలల్లో నికర పన్ను ఆదాయం రూ.17,32,193 కోట్లు కోట్లు లేదా బడ్జెట్‌ అంచనా (2022-23)లో 83 శాతంగా ఉంది. 2021-22 ఇదే సమయానికి ఈ వసూళ్లు బడ్జెట్‌ అంచనాల్లో 83.9 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాలు రూ.34.93 లక్షల కోట్లు లేదా బడ్జెట్‌ అంచనాల్లో 83.4 శాతంగా నమోదయ్యాయి. ఇందులో రెవన్యూ వ్యయాలు రూ.29,03,363 కోట్లు కాగా.. మూలధన వ్యయాలు రూ.5,90,227 కోట్లు. రెవెన్యూ వ్యయాల్లో రూ.7,98,957 కోట్లు వడ్డీ చెల్లింపులు కాగా.. ప్రధాన సబ్సిడీల కింద రూ.4,59,547 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని