తగ్గిన కరెంటు ఖాతా లోటు

గత ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబరు- డిసెంబరులో దేశ కరెంటు ఖాతా లోటు 18.2 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 2.2 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.

Published : 01 Apr 2023 04:49 IST

అక్టోబరు- డిసెంబరులో జీడీపీలో 2.2 శాతానికి: ఆర్‌బీఐ

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబరు- డిసెంబరులో దేశ కరెంటు ఖాతా లోటు 18.2 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 2.2 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. 2022-23 రెండో త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు 30.9 బి.డాలర్లు లేదా జీడీపీలో 3.7 శాతంగా ఉంది. 2021-22 అక్టోబరు- డిసెంబరులో కరెంటు ఖాతా లోటు 22.2 బి.డాలర్లు లేదా జీడీపీలో 2.7 శాతంగా నమోదైంది. 2022-23 రెండో త్రైమాసికంలో 78.3 బి.డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, మూడో త్రైమాసికంలో 72.7 బి.డాలర్లకు తగ్గడం వల్లే కరెంటు ఖాతా లోటు దిగివచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. సేవల ఎగుమతుల్లో 24.5 శాతం వృద్ధి ఉండటమూ ఇందుకు దోహదం చేసిందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని