హాల్‌మార్కింగ్‌గా ప్రకటించిన ఆభరణాలు అమ్ముకోవచ్చు

హాల్‌మార్కింగ్‌ చేసినవిగా ప్రకటించిన పసిడి ఆభరణాల నిల్వలను జూన్‌30 వరకు విక్రయించుకోవడానికి కేంద్రం శుక్రవారం అనుమతినిచ్చింది.

Updated : 01 Apr 2023 04:54 IST

జూన్‌ 30 వరకు గడువు  
16,000 మందికి పైగా వర్తకులకు కేంద్రం అనుమతులు

దిల్లీ: హాల్‌మార్కింగ్‌ చేసినవిగా ప్రకటించిన పసిడి ఆభరణాల నిల్వలను జూన్‌30 వరకు విక్రయించుకోవడానికి కేంద్రం శుక్రవారం అనుమతినిచ్చింది. మార్చి 31తో ఈ గడువు ముగుస్తుండగా,  3 నెలల అదనపు సమయం ఇస్తూ, ఉత్తర్వులిచ్చారు. ఆరు అంకెల హెచ్‌యూఐడీ హాల్‌మార్కింగ్‌తో ఆభరణాల విక్రయాన్ని తప్పనిసరి చేసే నిబంధనలు అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో జులై 2021కి ముందు హాల్‌మార్కింగ్‌ చేయించినట్లు ‘ప్రకటించిన’ పసిడి ఆభరణాలను అమ్ముకోవడానికి 16,243 మంది వర్తకులకు వెసులుబాటు కల్పించినట్లయింది. ఆమేరకు నోడల్‌ వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

వారికి మాత్రమే అనుమతులు: ‘హాల్‌మార్కింగ్‌ ఆఫ్‌ గోల్డ్‌ జువెలరీ అండ్‌ గోల్డ్‌ ఆర్టీఫాక్ట్స్‌ ఆర్డర్‌-2020’కు సవరణ చేసినట్లు నోటిఫికేషన్‌ తెలిపింది. పాత హాల్‌మార్కింగ్‌ నిల్వలను ప్రకటించిన ఆభరణ వర్తకులకు మాత్రమే అదనపు సమయం అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది. వీరు కూడా ఈ ఏడాది జూన్‌ 30 నాటికే ఆయా నిల్వల విక్రయం పూర్తి చేయాలని తెలిపింది. ఇదే చివరి గడువు అని.. ఇక పొడిగింపులు ఉండవని అదనపు కార్యదర్శి నిధి ఖరే వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు