వర్జిన్‌ ఆర్బిట్‌లో 85% ఉద్యోగాల కోత

అమెరికాలోని కాలిఫోర్నియాలో రిచర్డ్‌ బ్రాస్నన్‌కు చెందిన రాకెట్‌ కంపెనీ వర్జిన్‌ ఆర్బిట్‌.. తన సిబ్బందిలో 85 శాతం మంది లేదా 675 మందిని బయటకు పంపనుంది.

Published : 01 Apr 2023 02:34 IST

న్యూయార్క్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో రిచర్డ్‌ బ్రాస్నన్‌కు చెందిన రాకెట్‌ కంపెనీ వర్జిన్‌ ఆర్బిట్‌.. తన సిబ్బందిలో 85 శాతం మంది లేదా 675 మందిని బయటకు పంపనుంది. నిధులు సమీకరించడం క్లిష్టతరం కావడంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కోత విషయమై యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సంస్థ సమాచారం అందించింది. ఐరోపా నుంచి ఈ కంపెనీ తొలి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విఫలమయ్యాక పరిణామాలు మారాయి. ఉద్యోగ కోతలకు అవకాశం ఉన్నందున తన కార్యకలాపాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈ నెల మొదట్లో పేర్కొంది. బ్రిటన్‌ అంతరిక్ష పరిశ్రమలో మరిన్ని వాణిజ్య అవకాశాలు పెరుగుతాయని భావించిన తరుణంలో, తాజా పరిణామం ఆ దేశానికి శరాఘాతం లాంటిదేనని విశ్లేషకులు  భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని