ప్రభుత్వ అప్పులు రూ.150.95 లక్షల కోట్లు

ప్రభుత్వ మొత్తం అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం ముగిసేసరికి రూ.150.95 లక్షల కోట్లకు చేరాయి.

Published : 02 Apr 2023 01:39 IST

2022-23 డిసెంబరు త్రైమాసికానికి

దిల్లీ: ప్రభుత్వ మొత్తం అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికం ముగిసేసరికి రూ.150.95 లక్షల కోట్లకు చేరాయి. 2022 సెప్టెంబరు త్రైమాసికం ఆఖరుకున్న   రూ.147.19 లక్షల కోట్ల అప్పులతో పోలిస్తే    2.6% పెరిగాయి. ఈ నివేదికను శనివారం ఆర్థిక శాఖ విడుదల చేసింది. సుమారు 28.29 శాతం అప్పులకు 5 ఏళ్లలోపు గడువు తీరనుంది. 2022-23 మూడో త్రైమాసికంలో కేంద్రం సెక్యూరిటీల ద్వారా రూ.3,51,000 కోట్లను సమీకరించింది. ఇదే త్రైమాసికంలో గడువు తీరిన రూ.85,377.90 కోట్లను చెల్లించింది. ఈ త్రైమాసికంలో ప్రభుత్వం నగదు నిర్వహణ బిల్లుల ద్వారా ఎలాంటి మొత్తాన్ని సేకరించలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వ సెక్యూరిటీలకు ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీలను కూడా నిర్వహించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని