Air India: ఎయిరిండియాలో ప్రీమియం ఎకానమీ సీట్లు
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఎంపిక చేసిన విమానాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లనూ ఆఫర్ చేస్తోంది. విమానాల్లో ఫస్ట్‌క్లాస్, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ.. 4 కేబిన్ క్లాసులను అందించే తొలి, ఏకైక భారతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది.
4 కేబిన్ క్లాస్‌లను అందిస్తున్న తొలి సంస్థ
ప్రస్తుతం ఎంపిక చేసిన మార్గాల్లోనే
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఎంపిక చేసిన విమానాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లనూ ఆఫర్ చేస్తోంది. విమానాల్లో ఫస్ట్‌క్లాస్, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ.. 4 కేబిన్ క్లాసులను అందించే తొలి, ఏకైక భారతీయ విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది. ప్రారంభ దశలో బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానాలు నడిచే మార్గాల్లో (బెంగళూరు-శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబయి-శాన్‌ఫ్రాన్సిస్కో, ముంబయి-న్యూయార్క్) ప్రీమియం ఎకానమీ సీట్లు అందుబాటులో ఉంటాయి. ‘అందుబాటు ధరలోనే మెరుగైన సౌకర్యాలు కావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అందుకే మా వినియోగదార్లకు ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను అందుబాటులోకి తెచ్చాం. త్వరలో మరిన్ని మార్గాల్లో నడిచే విమానాల్లోనూ ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రపంచ స్థాయి సేవల ప్రమాణాల్లో ఈ విధంగా మరో అడుగు వేశామ’ని ఎయిరిండియా సీఈఓ, ఎండీ కాంబెల్ విల్సన్ పేర్కొన్నారు.
ఇవీ ముఖ్య సదుపాయాలు
* ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు విడిగా చెక్ ఇన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. చెక్-ఇన్ బ్యాగేజీలపై ప్రయారిటీ టాగ్‌లను వేస్తారు. విమానాల్లోకి ముందుగా ఆహ్వానిస్తారు.
* కేబిన్ కూడా వెడల్పాటి సీట్లతో పెద్దగా ఉంటుంది. 5 అంగుళాల రిక్లైన్, అడ్జస్టబుల్ లెగ్ రెస్ట్, ఫుట్ రెస్ట్‌లుంటాయి. అదనపు లెగ్ రూం వల్ల సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు.
* ఉచిత, అందమైన టీయూఎమ్‌ఐ అమ్నెటీ కిట్ (ఎయిరిండియా కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు) ఇస్తారు. ఇందులో విమాన సాక్స్‌లు, ఐ మాస్క్, మాలిన్+గోయెట్జ్ లిప్ మాయిశ్చర్, పెన్, కార్పెట్ స్లిప్పర్లు ఉంటాయి.
* ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్(ఐఎఫ్‌ఈ)ను ఉపయోగించుకునేందుకు సౌకర్యవంతమైన హెడ్‌ఫోన్స్ ఇస్తారు.
* ఆహారం విషయానికొస్తే.. వెల్కమ్ డ్రింక్ అందిస్తారు. ఎంపిక చేసిన మూడు మీల్స్, ఆల్కహాల్, నాన్-ఆల్కహాల్ పానీయాలు, ఇతరత్రా ఆహారం అందిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!